కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి నివాళుర్పించారు. అనంతరం కడప ITI సర్కిల్ నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు ఆశీర్వదించి మీ ఆడబిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా నామినేషన్‌కు బయలుదేరే ముందు షర్మిల(YS Sharmila) పోస్ట్ చేస్తూ ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని, వైఎస్ వివేకానందరెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని తెలిపారు.
Filed nomination for Kadapa Loksabha … “The Battle is the Lord’s” 🙏 pic.twitter.com/M3tfgiSlsh
— YS Sharmila (@realyssharmila) April 20, 2024