వినుకొండలో రషీద్ హత్యపై ఢిల్లీలో ధర్నా చేస్తామన్న జగన్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల(YS Sharmila) ఘాటుగా స్పందించారు. జగన్ ఏం మాట్లాడుతున్నారా ఆయనకైనా అర్థమవుతుందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. వినుకొండలో జరిగింది వ్యక్తిగత హత్య కానీ, రాజీకయ హత్యకాదని, ఆ ఘటనకు రాజకీయ రంగు పులుముతుందే జగన్ అని మండిపడ్డారు. ఈ విషయంలో ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీసీ కార్యకర్త ఒకరు హత్యకు గురైతేనే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానన్న జగన్.. సొంత బాబాయి (వైఎస్ వివేకానంద రెడ్డి) హత్యకు గురైనప్పుడు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? అని ప్రశ్నించారు.
‘వివేకా హంతకులతో జగన్(YS Jagan) తిరుగుతున్నారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు? వినుకొండ హత్య వ్యక్తిగతంగా జరిగింది. అది రాజకీయ హత్యకాదు. సమావేశాలు కూడా ప్రారంభంకాకుండానే బాయ్‌కాట్ అంటూ బయలకు వచ్చి ఏం చేస్తారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత సీఎం చంద్రబాబు(Chandrababu) తీసుకోవాలి. వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి’’ అని షర్మిల(YS Sharmila) చెప్పారు.