వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో విలీనం అయింది. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal), ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, పలువురు నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో షర్మిల(YS Sharmila) చేరిన నేపథ్యంలో ఆమెకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా? అనే దానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
Senior leader from Andhra Pradesh YS Sharmila ji joins the INC in the presence of Congress President Shri @kharge, Shri @RahulGandhi and General Secy (Org.) Shri @kcvenugopalmp at the AICC HQ in New Delhi. pic.twitter.com/LqMvqqqwCm
— Congress (@INCIndia) January 4, 2024