YS Sharmila | వైఎస్ కుటుంబం చీలడానికి కారణం జగన్‌.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

-

వైఎస్సార్ కుటుంబాన్ని సీఎం జగన్ చీల్చారంటూ ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబం చీలిందంటే జగనే కారణం.. ఇందుకు సాక్ష్యం దేవుడు, తల్లి విజయమ్మ, కుటుంబం సాక్ష్యమని తెలిపారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చినట్లు జగన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

YS Sharmila ఇంకా ఏం అన్నారంటే..

“జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి ఎండనకా, వాననకా రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా.

ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో ‘బై బై బాబు‘ అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. వైఎస్సార్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. రాజశేఖర్ రెడ్డి గారి పాలనకు జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది” అని షర్మిల వెల్లడించారు.

Read Also: అరికాళ్ళలో నొప్పి వేధిస్తుందా? ఇవి పాటించండి!!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...