ఏపీ సీఎం జగన్(CM Jagan) రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ(YSR Aarogyasri) కింద 25 లక్షల రూపాయల వరకూ ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 18 నుంచి రూ.25లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. వైయస్పార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు.
అలాగే ఆరోగ్యశ్రీ(YSR Aarogyasri) కింద చికిత్స చేయించుకున్న వారికి రవాణా ఛార్జీల కింద రూ.300 సైతం చెల్లించాలని సూచించారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్న దానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని సమీక్షా సమావేశంలో ఆయన సూచించారు.