Amaravathi: మేము అమరావతికి వ్యతిరేకం కాదు: వైవీ సుబ్బారెడ్డి

-

దేశంలో ప్రముఖ నగరంగా ఉంది.. ఇక్కడ రాజధాని నిర్మించుకొని, పాలన కొనసాగిస్తే బాగుటుందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో శాసన సభ, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని రావాలి అని అన్నారు. అమరావతి (Amaravathi) పాదయాత్ర చేస్తున్న వారికి నిరసన తెలపాలని జేఏసీ పిలుపు మేరకు విశాఖ గర్జన చేపట్టామనీ.. అందుకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిస్తామని వివరించారు. మేము అమరావతికి (Amaravathi) ఏ కోశానా వ్యతిరేకం కాదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించారు. విశాఖలో జరిగే ర్యాలీకు పార్టీ శ్రేణులు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్‌ భావిస్తున్నారనీ.. అందులో భాగంగానే మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...