Budget 2023: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గానూ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1గంటా 26 నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్ ప్రసంగంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. యూనియన్ బడ్జెట్ లో కొత్త స్కీమ్ ప్రకటన
-