Union Budget 2023: రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ తో పాటు ఆప్ ఎంపీలు బహిష్కరించారు. కాంగ్రెస్ నుంచి కొంత మంది ఎంపీలు మాత్రమే సభకు హాజరయ్యారు. భారత్ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్ లో మంచు కారణంగా అక్కడే కొందరు కాంగ్రెస్ ఎంపీలు చిక్కుకున్నారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ తో పాటు మరికొంత మంది మాత్రమే హాజరయ్యారు.