తగ్గిన భారత్ వృద్ధి అంచనా.. స్పష్టం చేసిన ఆర్థిక సర్వే

0
Union Budget 2023

Economic Survey – Union Budget 2023: 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే వచ్చేసింది. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాలతో పోలిస్త భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ఆర్థిక సర్వే సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతం ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిరేటు అంచనా వేసినప్పటికీ అది కాస్త తగ్గే అవకాశం ఉందని దాంతో 6.8 శాతం వరకు ఉండవచ్చని ఆర్థిక సర్వే లెక్కగట్టింది. 2021-22లో ఇది 8.7శాతంగా ఉంది. రూపాయి విలువ పతనం ఆందోళన కరంగా ఉన్నప్పటికీ భారత్ వద్ద విదేశీ మారకద్రవ్యం తగినంత ఉందని చెప్పారు. ప్రపంచ మార్కెట్లు తిరోగమణం దిశలో ఉన్న నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ సారి అంచనా తగ్గుదల చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఆర్థిక పరిస్థితులు పూర్వ స్థితికి చేరుకున్నాయి. కరోనా కారణంగా మందగించిన ఆర్థిక స్థితి తిరిగి గాడిలో పడిందని నిర్మలా స్పష్టం చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here