అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు షురూ

5G services launched in superpower America

0
125

అగ్ర రాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు 5 జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. విమాన యాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్‌ పోర్టు చుట్టూ 5 జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి. మిగిలిన చోట్లు సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి.

అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి. ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.

గతంలోనే ఈ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా..ఎయిర్​లైన్ల ఆందోళనలు, బైడెన్ యంత్రాంగం చేపట్టిన చర్యల నేపథ్యంలో.. 5జీ సేవల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ ప్రకటించాయి. నిర్దిష్ట ఎయిర్​పోర్టుల వద్ద సర్వీసులను ప్రారంభించడం లేదని తెలిపాయి. ఈ సమస్యపై ఎయిర్​లైన్ సంస్థలు బైడెన్ యంత్రాంగానికి లేఖ రాసిన నేపథ్యంలో తాజా ప్రకటన చేశాయి.