మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ డౌన్​లోడ్ చేయండిలా..

Aadhaar download without mobile number..how is that?

0
65

ఆధార్​ కార్డ్​ డౌన్​లోడ్​ చేసుకోవాలంటే రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్​ నెంబర్​కి ఓటీపీ వస్తుంది. అనంతరం కార్డ్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు. కానీ రిజిస్టర్డ్ మొబైల్​ నెంబర్​ లేకుండా కూడా ఆధార్ డౌన్​లోడ్ చేయొచ్చు. ఇంతకీ అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో భారత పౌరులందరికీ ఆధార్​ కార్డ్ కీలకంగా మారింది. దూర ప్రయాణాలు చేసేప్పుడైనా, మీ కొరియర్​ని అందుకోవాలన్నా సంబంధిత అథారిటీకి మిమ్మల్ని గుర్తించడం ఆధార్​తో సులభతరం. అయితే.. ఆధార్ అధికారిక వెబ్​సైట్​ నుంచి కార్డ్​ను డౌన్​లోడ్ చేసుకుని వెంట ఉంచుకువాల్సిందే. రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ లేకున్నా ఆధార్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు. కానీ అందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.​

అధికారిక వెబ్​సైట్​ ‘యూఐడీఏఐ’ని ఓపెన్​ చేసి ‘my Aadhaar’ ఆప్షన్​ సెలెక్ట్​ చేసుకోవాలి.

‘order Aadhaar PVC card’ ఆప్షన్​ సెలక్ట్ చేసుకోవాలి.

12 అంకెల ఆధార్​ నంబర్​ ఎంటర్ చేయాలి

16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్​ నెంబర్​ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

‘my mobile number is not registered’ ఆప్షన్​ ఎంచుకోవాలి.

ప్రస్తుతం సర్వీస్​లో ఉన్న మొబైల్​ నెంబర్​ ఎంటర్​ చేయాలి.

‘send OTP’ ని క్లిక్​ చేయాలి. మీ మొబైల్​కు ఓటీపీ వస్తుంది.

‘Terms and conditions’ని సెలెక్ట్ చేసి ‘submit’ ని క్లిక్ చేయాలి.

అప్పుడు మీ ఆధార్​కార్డ్​ ప్రివ్యూ కనిపిస్తుంది.

‘make payment’ ఆప్షన్​ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసేయాలి. ఆ తర్వాత మీకు కావల్సిన ఆధార్​ కార్డ్​ డౌన్​లోడ్​ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.