ప్రస్తుతం ఆధార్ అన్ని చోట్లా తప్పనిసరిగా మారింది. అలాంటి ఆధార్ కార్డులోనూ నకిలీలు పుట్టుకోస్తున్నాయి. మోసాలు జరుగుతున్నాయి. అందుకే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కలిగిన ప్రతి వ్యక్తి తమ ఆధార్‌ను వెరిఫై చేసుకోవాలని సూచిస్తోంది. ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్, మొబైల్ యాప్ ద్వారా కూడా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చని తెలిపింది.
మీ పీసీలో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ‘యూఐడీఏఐ’ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
అందులో ‘మై ఆధార్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ‘ఆధార్ సర్వీసెస్’ పేరుతో జాబితా కనిపిస్తుంది.
అక్కడ ‘వెరిఫై యాన్ ఆధార్ నంబర్’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే వెరిఫై ఆధార్ పేరుతో పేజీ ఓపెన్ అవుతుంది. లేదా https://resident.uidai.gov.in/ అనే లింక్‌ని కాపీ చేసి మీ వెబ్ బ్రౌజర్‌లో పేస్ట్ చేస్తే ఆధార్ వెరిఫికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
పేజీ ఓపెన్ అయ్యాక అందులో మీ 12 అంకెల ఆధార్ నంబర్ టైప్ చేసి ‘ప్రొసీడ్ టు వెరిఫై’ పై క్లిక్ చేస్తే మీ ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిందనే మెసేజ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలా సులభంగా మీ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో అయితే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎమ్‌ఆధార్ (mAadhaar) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వెరిఫికేషన్‌ను పూర్తి చేయొచ్చు. యాప్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యాక ఆధార్ సర్వీసెస్‌లో వెరిఫై ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్ టైప్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు.
ఆధార్ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ ఐఓఎస్, మైక్రోసాఫ్ట్ విండోస్ వెర్షన్ యాప్‌లు లేవు. కాబట్టి ఐఓఎస్, విండోస్ యూజర్లు ఆధార్ పేరుతో ఏవైనా యాప్‌లు కనిపిస్తే వాటిని డౌన్‌లోడ్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.