మరో సంచలనం..అతి తక్కువ ధరకే జియో నుండి ల్యాప్ టాప్స్

0
84

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించింది రిలయన్స్‌ జియో. ఎన్నో అద్భుతమైన ఆఫర్లతో యూజర్లకు మరింత చేరువైంది జియో. ప్రస్తుతం తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ను పరిచయం చేసిన జియోకు అత్యంత తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఇక తాజాగా దీపావళికి జియో నుంచి స్మార్ట్‌ ఫోన్‌లు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా జియో తక్కువ ధరకే ‘జియోబుక్‌’ పేరుతో ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యంగా విద్యార్థులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్ టాప్స్ కోసం ఎదురుచూస్తున్న వినియోగ దారులే లక్ష్యంగా  మార్కెట్లో అడుగుపెట్టనుంది.అత్యంత చవకైన ల్యాప్‌టాప్‌గా చర్చ జరుగుతోన్న ఈ జియో బుక్‌ ఫీచర్లు కొన్ని నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి.

జియో ఈ ల్యాప్‌టాప్‌ను రెండు విభిన్న మోడల్స్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.టెక్నాలజి రంగ నిపుణుల అంచనా ప్రకారం, Jio తన మొదటి ల్యాప్‌టాప్ JioBook కోసం హార్డ్‌వేర్ ఆమోదం ఈ ఫీచర్లు ల్యాప్‌టాప్‌లో ఉండవచ్చు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తోన్న ఈ ల్యాప్‌టాప్‌లో 1,366×768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్‌టీఈ మోడెమ్ డిస్‌ప్లేని అందించనున్నారని వార్తలు వస్తున్నాయి.

వీటి ప్రకారం ఈ ల్యాప్‌టాప్‌ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నట్లు సమాచారం. లీక్ అయిన సమాచారం ప్రకారం, JioBook 4GB LPDDR4x RAM, 64GB eMMC 5.1 స్టోరేజ్‌తో పాటు 2GB LPDDR4X RAM, 32GB eMMC 5.1 స్టోరేజ్‌తో కూడా పొందొచ్చు.