పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన ధరలు

0
36

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వాటిలో బంగారం కూడా ఒకటి. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

హైదరాబాద్ నగరంలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగి రూ. 52, 090 గా నమోదవుతుంది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 47, 750 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు విషయానికొస్తే..కేజీ వెండి ధర రూ. 200 పెరిగి రూ. 64, 400 గా నమోదు అయింది.