గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న చమురు ధరల పెంపునకు సోమవారం కాస్త బ్రేక్ పడింది. పెట్రోల్, డీజిల్పై సగటున రోజుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. పెంపుపై సోమవారం ఎలాంటి ప్రకటన చేయలేదు. 18 నెలల వ్యవధిలో పెట్రోల్ ధర లీటర్కు రూ.36, డీజిల్పై లీటర్కు రూ.26.58 మేర పెరిగింది.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.105.04 కి చేరింది. గుంటూరులో పెట్రోల్ ధర లీటర్కు రూ.113.89కి చేరింది. డీజిల్పై 35 పైసలు పెరిగి లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.42కు చేరగా..లీటర్ డీజిల్ ధర రూ.104.34 వద్ద కొనసాగుతోంది.
ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులనుఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గాలని సామాన్యులు కోరుకుంటున్నారు.