హమ్మయ్య..పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేక్

Break for petrol and diesel prices

0
33

గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న చమురు ధరల పెంపునకు సోమవారం కాస్త బ్రేక్​ పడింది. పెట్రోల్​, డీజిల్​పై సగటున రోజుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. పెంపుపై సోమవారం ఎలాంటి ప్రకటన చేయలేదు. 18 నెలల వ్యవధిలో పెట్రోల్​ ధర  లీటర్​కు రూ.36, డీజిల్​పై లీటర్​కు రూ.26.58 మేర పెరిగింది.

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.04 కి చేరింది. గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు రూ.113.89కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర రూ.113.42కు చేరగా..లీటర్​ డీజిల్​​ ధర రూ.104.34 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు, సామాన్య ప్రజలు  తీవ్ర ఇబ్బందులనుఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గాలని సామాన్యులు కోరుకుంటున్నారు.