వరుస నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు మంగళవారం మాత్రం ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా బిగ్బుల్ రాకేశ్ ఝున్ ఝున్వాలాపై కాసులు వర్షం కురిసింది. కేవలం పది నిమిషాల్లో ఏకంగా రూ. 186 కోట్లు గడించారు ఝున్‌ఝున్‌వాలా.
సోమవారం ఎన్ఎస్ఈ సెషన్ క్లోజింగ్ నాటికి రూ.2,398 ఉన్న టైటాన్ షేర్ విలువ మార్కెట్ ఓపెనింగ్ సెషన్లో రూ. 23.95 పెరిగి.. రూ.2,435 లకు చేరింది. ఇదే విధంగా టాటా మోటార్స్ షేర్ కూడా రూ. 4.70 పెరిగి రూ.476.15కి చేరింది. దీంతో కేవలం పదే నిమిషాల్లో రూ. 186 కోట్ల ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో వచ్చి చేరాయి.
టైటాన్లో రాకేశ్‌కు 3,37,60,395 షేర్లు ఉండగా ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా 95,40,575 షేర్లు కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిపి మొత్తం 4,33,00,970 షేర్లు ఉన్నాయి. టాటా మోటార్స్‌లో రాకేశ్‌కు 3,67,50,000 షేర్లు ఉన్నాయి.