డీమార్ట్​కు కాసుల పంట..ఎంత లాభమంటే?

0
83

ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్​ హెచ్​డీఎఫ్​సీ లాభాల పంట  పండించింది. రెండో త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. ఏకంగా 18 శాతం నికరలాభాన్ని ఆర్జించింది. మరోవైపు రిటైల్​ దిగ్గజం డీ మార్ట్​ కూడా రెండింతల లాభాన్ని ఆర్జించింది.

రెండో త్రైమాసికంలో దేశీయ ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 18 శాతం పెరిగి రూ.9,096కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ. 7,513 కోట్లుగా ఉంది.

డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం రెండింతలు పెరిగి..రూ.417 కోట్లకు చేరుకుందని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 198.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని బీఎస్​ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇక 2021 జులై-అక్టోబర్​ మధ్య ఆదాయం 46.79 శాతం పెరిగి రూ.7,788.94 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.5,306.02 కోట్లుగా ఉంది.