కాసేపట్లో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఎల్పీ సమావేశం

TRS joint LP meeting for a while

0
144
KCR

టీఆర్‌ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల ఉమ్మడి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, సర్వసభ్య సమావేశం, ఈ నెల 25న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై చర్చించనున్నారు.

వాటితోపాటు ప్రజాసమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలు మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశముంది. పార్టీ పురోగతిపై నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలు, నగర కమిటీలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది.