గూగుల్ క్రోమ్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే క్రోమ్ మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. కాలానుగుణంగా దీనిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవేంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
షార్ట్ కట్స్:
ఐదైనా పనిని వేగంగా పూర్తి చేయడానికి షార్ట్ కట్ కీస్ ఎంతో ఉపయోగపడతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, గూగుల్ బ్రౌజర్‌లో వేగవంతంగా పనిచేయడానికీ కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. విండోస్‌తో పాటు మ్యాక్ బుక్‌లో క్రోమ్ బౌజర్ షార్ట్ కీస్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
బుక్‌మార్క్ కమాండ్స్..
పీసీలో లేదా మొబైల్‌లో బ్రౌజింగ్ చేసేటప్పుడు మనకు నచ్చిన పేజ్ లేదా వెబ్‌సైట్‌ను భవిష్యత్తు అవసరాల కోసం బుక్‌మార్క్ చేస్తుంటాం. ఇవన్నీ క్రోమ్ బ్రౌజర్ బార్‌లో “Chrome://…” తో కనిపిస్తాయి. అయితే, బుక్‌మార్క్ చేసుకోవాలనే వాటిని సేవ్ చేయడానికి కొన్ని కమాండ్స్ ఉన్నాయి.
ఎక్స్పరిమెంటల్ ఫీచర్..
క్రోమ్ బౌజర్ తాజా ఫీచర్లు విడుదల కావడానికంటే ముందే ఎక్స్పరిమెంటల్ (ప్రయోగాత్మక) ఫీచర్లను ప్రయత్నించాలి. దీనికోసం క్రోమ్ బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
గూగుల్ క్రోమ్ బీటా వర్షన్‌లో ఎక్స్పరిమెంటల్ అనే ట్యాబ్‌ను ఓపెన్ చేసుకోవాలి. దానిలో డీఫాల్ట్‌ను ఎనబుల్ చేసుకుంటే సరిపోతుంది.
ఫైల్స్ నేరుగా గూగుల్ డ్రైవ్‌లోనే..
మనకు కావాల్సిన ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసి వాటిని ముందు డిస్క్‌లో సేవ్ చేయాల్సి ఉంటుంది. కానీ, నేరుగా గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేయడానికి వీలుపడదు. దీనికి నిఫ్టీ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫైల్స్‌ను నేరుగా గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి సెటప్ చేసుకున్నాక సేవ్ టు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఫైల్ సేవ్ అవుతోంది.