ఇంటర్నెట్‌ లేకుండానే డిజిటల్‌ చెల్లింపులు..!

Digital payments without internet ..!

0
28

దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో త్వరలో ఇంటర్నెట్‌ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం ఏర్పడనుంది. దీనిపై త్వరలో ఓ కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ ప్రకటించారు.

దీనికి సంబంధించి గత ఏడాది ఆగస్టులోనే ఆర్‌బీఐ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది. తక్కువ విలువ కలిగిన రిటైల్‌ లావాదేవీలను కార్డులు, మొబైల్‌ సాధనాల ద్వారా పూర్తి చేసేందుకు అనుమతించింది. ఈ విధానంలో గరిష్ఠంగా రూ.200 వరకు స్వీకరించారు.

ఈ పైలట్‌ ప్రాజెక్టు 2021, మార్చి 31 వరకు కొనసాగింది. ఎలాంటి అదనపు ధ్రువీకరణలు అవసరం లేకుండానే చెల్లింపులను అనుమతించారు. కార్డులు, మొబైల్‌ వ్యాలెట్ల ద్వారా డబ్బులను స్వీకరించారు. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడం వల్ల దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంటర్నెట్ సదుపాయం లేని లేదా నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ అప్పట్లో పేర్కొంది.