స్మార్ట్‌ఫోన్ యూజర్లను జోకర్ మాల్వేర్ కలవరపెడుతూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో యాప్స్‌లో జోకర్ మాల్వేర్ బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో యాప్‌లో జోకర్ మాల్వేర్ ఉందన్న విషయం బయటపడింది.
ఇటీవల కొన్ని యాప్స్ జాబితాను విడుదల చేసిన గూగుల్ వాటిని డిలిట్ చేయాలని యూజర్లను కోరింది. ఇప్పుడు మరో యాప్‌లో జోకర్ మాల్వేర్ బయటపడింది. మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి. ఇంతకీ ఆ యాప్ ఏంటి?..దానివల్ల కలిగే అనర్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Pradeo సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ ఈ విషయాన్ని బయటపెట్టారు. Color Message యాప్‌లో జోకర్ మాల్వేర్ ఉన్నట్టు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో జోకర్ మాల్వేర్ ఉన్న యాప్స్ జాబితాను Pradeo సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ తమ ఆర్టికల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్గా Color Message యాప్ పేరు కనిపించింది.
కలర్ మెసేజ్ యాప్ యూజర్ల ఎస్ఎంఎస్లను పర్సనలైజ్డ్గా మార్చే యాప్. ఇందులోనే జోకర్ మాల్వేర్ బయటపడింది. మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసినట్టైతే డిలిట్ చేయండి. జోకర్ మాల్వేర్ ఉన్న Color Message యాప్‌ను ఇప్పటికే 500,000 సార్లు డౌన్లోడ్ చేశారని తేలింది. ఈ యాప్‌లో ఉండే జోకర్ మాల్వేర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తెలియకుండా ప్రీమియం సర్వీసులకు సైన్ ఇన్ చేస్తుంది. ఆ తర్వాత అకౌంట్ నుంచి డబ్బులు మాయం అవుతూ ఉంటాయి. ఇప్పటికే జోకర్ మాల్వేర్ కారణంగా ఇబ్బందులు పడ్డ యూజర్లు లక్షల్లో ఉన్నారు.
ఇటీవల Easy PDF Scanner, Now QRCode Scan, Super-Click VPN, Volume Booster Louder Sound Equalizer, Battery Charging Animation Bubble Effects, Smart TV Remote, Volume Boosting Hearing Aid, Flashlight Flash Alert on Call, Halloween Coloring, Classic Emoji Keyboard, Super Hero-Effect, Dazzling Keyboard, EmojiOne Keyboard, Battery Charging Animation Wallpaper, Blender Photo Editor-Easy Photo Background Editor యాప్స్‌లో కూడా జోకర్ మాల్వేర్ ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కీ బయటపెట్టింది