వాట్సాప్‌లో యూపీఐ పిన్‌ ఎలా మార్చాలో తెలుసా..?

Do you know how to change UPI PIN in WhatsApp?

0
40

ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్‌ కూడా పేమెంట్స్‌ ఆప్షన్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2018లో వాట్సాప్‌ పే పేరుతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌పేలో మొత్తం 227 బ్యాంకులు అనుసంధానం ఉన్నాయి.

వాట్సాప్‌ పే సహాయంతో డబ్బులు పంపించుకోవడంతో పాటు, బ్యాలెన్స్‌ చెకింగ్, యూపీఐ పిన్‌ కూడా మార్చుకోవచ్చు. అయితే చాలా మందికి వాట్సాప్‌పే ద్వారా డబ్బులు పంపించుకోవడం, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం మాత్రమే తెలుసు.. కానీ యూపీఐ పిన్‌ ఎలా మార్చుకోవాలో తెలియదు. కొన్ని సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా యూపీఐ పిన్‌ను మార్చుకోవచ్చు..అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం

ముందుగా వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి.

తర్వాత ఆండ్రాయిడ్‌ యూజర్లు కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్‌ చేసి పేమెంట్స్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. ఐఫోన్‌ యూజర్లు కింద కుడివైపు ఉన్న సెట్టింగ్స్‌లో ఉండే పేమెంట్స్‌ ఆప్షన్స్‌కి వెళ్లాలి.

పేమెంట్స్‌ ఆప్షన్‌ కింద ఉండే బ్యాంక్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేయాలి.

తర్వాత చేంజ్‌ యూపీఐ పిన్‌ ఆప్షన్‌ను నొక్కాలి.

ఇప్పుడు మీ పాత యూపీఐ పిన్‌ను ఎంటర్‌ చేసి రెండో బాక్సులో మీరు మార్చాలనుకుంటున్న పిన్‌ను ఎంటర్‌ చేయాలి.

చివరిగా పిన్‌ను కన్ఫామ్‌ చేస్తే సరిపోతుంది. మీ పిన్‌ చేంజ్ అవుతుంది.