‘మాస్క్‌డ్ ఆధార్’ అంటే ఏంటో తెలుసా? ఈ కార్డుతో ఎన్ని లాభాలంటే..

Do you know what 'masked Aadhaar' means? Do you know the benefits of this card?

0
87

ఆధార్‌ ఇప్పుడు ప్రతి భారతీయుడూ ప్రతి సందర్భంలోనూ వెంట ఉంచుకోవాల్సిన ధ్రువపత్రంలా మారిపోయింది. బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా..కొత్త సిమ్‌ తీసుకోవాలన్నా..ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల గుర్తింపు కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్‌ దుర్వినియోగం గురించీ భయాందోళనలు ఉన్నాయి. ఒకవేళ మీ ఆధార్‌ నంబర్‌ దుర్వినియోగం అవుతుందని మీరు భావిస్తే మాస్క్‌డ్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం.

12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ఉండే ఆధార్‌ పత్రమే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌. దీనిపై మీ ఫొటో, క్యూఆర్‌ కోడ్‌, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్‌ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ ఉపయోగపడుతుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు. ఆధార్‌ నంబర్‌ పూర్తిగా అవసరం ఉన్న చోట మాత్రం ఇది ఉపయోగపడదనేది గుర్తుంచుకోవాలి. మీకూ మాస్క్‌డ్‌ ఆధార్‌ కావాలంటే ఈ దిగువ ఇచ్చిన సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయ్యి డౌన్‌లోడ్‌ చేసుకోండి..

డౌన్‌లోడ్‌ ఇలా..

UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్‌ ఆధార్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేముందు అక్కడ ఉన్న ‘మాస్క్‌డ్‌ ఆధార్‌’ టిక్‌బాక్స్‌ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.

ఆ తర్వాత సెండ్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేస్తే ఆధార్‌తో జత చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌ క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత మీకు పీడీఎఫ్‌ రూపంలో ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్‌ ద్వారా వస్తాయి.