ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వచ్చాయా డోంట్ వర్రీ ఇలా మార్చుకోండి

Don't worry if you get torn notes from the ATM

0
104

ఈ రోజుల్లో మనం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కావాలంటే వెంటనే ఏటీఎంకు వెళ్తుంటాము. బ్యాంకులో అయితే చిరిగిన నోట్లు ఇస్తే వెంటనే వేరే నోటు ఇవ్వమని సిబ్బందిని అడుగుతాము. అయితే ఏటీఎంలో ఇలా చిరిగిన నోట్లు వస్తే పరిస్దితి ఏమిటి అని చాలా మందికి ఓ ఆలోచన. ఇలా వచ్చిన నోట్లు బయట ఎవరూ తీసుకోక ఇబ్బంది పడుతూ ఉంటారు కస్టమర్లు.

 

అయితే కస్టమర్లు ఈ విషయం తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఏటీఎంల నుంచి చిరిగినా, లేదా మురికిగా మారిన నోట్లు వస్తే వాటిని మీరు బ్యాంకులో ఇచ్చి మళ్లీ వేరే నోట్లు తీసుకోవచ్చు. కస్టమర్ల నుంచి బ్యాంకులు ఇలాంటి నోట్లు తీసుకోవాలి అని 2017 ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే మీరు ఏ బ్యాంకు ఏటీఎంలో ఈ నగదు తీశారో ఆబ్యాంకు బ్రాంచ్ కు వెళ్లండి. దీనిపై లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఎంత డబ్బు విత్ డ్రా చేశారు, అలాగే ఆ విత్ డ్రా స్లిప్ వస్తుంది కదా అది ధరఖాస్తుతో ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని జిరాక్స్ తీసి ఉంచుకోండి బెటర్. మీ దగ్గర ఆ స్లిప్ లేకపోతే లావాదేవీ ఎస్ఎంఎస్ను చూపించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఇచ్చిన రోజే మీకు నగదు ఇవ్వడం జరుగుతుంది.