ఫ్రీ..ఫ్రీ-యూట్యూబ్ శుభవార్త..!

0
97

సంగీత ప్రియులకు శుభవార్త. ఇంతకాలం పెయిడ్‌ సర్వీసుగా ఉన్న యూట్యూబ్‌ మ్యూజిక్‌ని ఇకపై కస్టమర్లకు ఫ్రీగా అందివ్వాలని గూగుల్‌ నిర్ణయించింది. ఈ ఆఫర్‌ అందుబాటులోకి వస్తే అచ్చంగా రేడియో తరహాలో ఇకపై సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ని నవంబరు 3 నుంచి ఫ్రీ సర్వీసుగా అందిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. మొదట కెనడాలో ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని..ఆ తర్వాత దశల వారీగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తామని ప్రకటించింది.

ఇండియాలో కొన్ని హై ఎండ్‌మొబైల్‌ ఫోన్లలో బండిల్‌ ఆఫర్‌గా యూట్యూబ్‌ మ్యూజిక్‌ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.