జియోఫోన్‌ నెక్ట్స్ లాంచ్..సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు

Geophone Next Launch..Sundar Pichai Key Comments

0
114

భారత మొబైల్‌ నెట్‌వర్క్‌లో జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియోఫోన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ఫోన్‌తో జియో మరో  సంచలనాన్ని నమోదు చేయనుంది. ప్రపంచంలో అత్యంత చౌకైన ఫోన్‌ జియోఫోన్‌ నెక్ట్స్‌ త్వరలోనే రిలీజ్‌ కానుంది. దీపావళి రోజున జియోఫోన్‌ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.

జియోఫోన్‌ నెక్ట్స్ లాంచ్‌ భారత్‌లో ఈ దీపావళి పండుగకు భారతీయుల ముందుకు  వస్తోందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ధృవీకరించారు. ఈ సందర్భంగా సుందర్‌పిచాయ్‌ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో జియోఫోన్‌ నెక్ట్స్ నాయకత్వం వహిస్తోందని సుందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ రాకతో భారత్‌లో డిజిటల్‌ పరివర్తన కోసం ఒక పునాది చూపబడుతుందని అభిప్రాయపడ్డారు.

రాబోయే సంవత్సరాల్లో జియోఫోన్‌ నెక్ట్స్ ఫీచర్‌-రీచ్‌ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోందని అన్నారు. జియోఫోన్‌ నెక్ట్స్‌తో భారతీయులు ఫీచర్‌ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  భారత్‌ లాంటి దేశాలు ఆసియా-పపిఫిక్‌ రిజియన్‌లో గూగుల్‌కు ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించారు. కాగా జియో, గూగుల్‌ భాగస్వామ్యంతో  జియోఫోన్‌ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను  రూపొందించిన విషయం తెలిసిందే.

జియోఫోన్‌ నెక్ట్స్ ఫీచర్స్‌..!

5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్

అడ్రినో 306 జీపీయు

2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ

8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా

13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా

స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్

ధర – రూ.3,499