న్యూజిలాండ్​కు షాక్​..​ భారత్​తో మ్యాచ్​కు స్టార్ ప్లేయర్ దూరం!

Shock to New Zealand .. Star player away for match against India!

0
32

టీ20 ప్రపంచకప్​లో భాగంగా టీమ్ఇండియాతో తలపడేందుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్​ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాలి పిక్క భాగంలో చీలిక కారణంగా జట్టుకు దూరమవుతున్నట్లు ఫెర్గుసన్​ ప్రకటించగా..ఇప్పుడు మరో ఆటగాడు మార్టిన్ గప్తిల్ కూడా జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భాగంగా హ్యారిస్​ రౌఫ్​ బౌలింగ్​లో ఓపెనర్​ గప్తిల్ కాలి వేలుకు గాయమైంది. దీంతో భారత్​తో జరిగే మ్యాచ్​లో అతడు​ ఆడటం అనుమానమే అని కివీస్​ జట్టు ప్రధాన కోచ్ గారీ స్టెడ్ తెలిపాడు. కాలి వేలుకు గాయమైన కారణంగా పాక్​తో మ్యాచ్ అనంతరం గప్తిల్ కాస్త నీరసంగా కనిపించాడు. మరో రెండు రోజుల్లో అతడి గాయం తగ్గుతుందా లేదా అనేది స్పష్టత వస్తుందని స్టెడ్ పేర్కొన్నాడు.

మంగళవారం జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​పై అలవోకగా గెలిచి టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది పాకిస్థాన్. బౌలింగ్​తో న్యూజిలాండ్​ను కట్టడి చేసి 134 పరుగులు స్వల్ప లక్ష్యానికే పరిమితం చేసింది. అనంతరం ఛేదనలో మహ్మద్ రిజ్వాన్(33 పరుగులు), ఆసిఫ్ అలీ(27 పరుగులు)తో రాణించి పాక్​ విజయంలో కీలక పాత్ర పోషించారు.