ఇన్ స్టాంట్ గా పాన్ కార్డ్ ఇలా పొందండి – జ‌స్ట్ 5 నిమిషాలు ప్రాసెస్ ఇదే

Get PAN Card Instantly Like This- This is the process that takes just 5 minutes

0
109

ఈ రోజుల్లో ఏ ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్ అయినా క‌చ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఆ పాన్ నెంబ‌ర్ ఉంటేనే ఎక్కువ అమౌంట్ అయినా జ‌మ చేయ‌డానికి విత్ డ్రాల్ కి క‌చ్చితంగా బ్యాంకులో అడుగుతున్నారు. ఇక చాలా మంది పాన్ కార్డ్ పొగొట్టుకుని ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.
ఐటీ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

మ‌రి ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం
ముందు మీరు ఆదాయ ప‌న్ను వెబ్ సైట్ చూడండి అక్కడ లాగిన్ అవ్వాలి
మీకు పాన్ కార్డు నెంబర్ గుర్తుకు లేకపోతే ఆధార్ నెంబర్‌తో పొందవచ్చు.
మీరు క‌చ్చితంగా ఇలా పొందాలి అంటే ఆధార్ పాన్ లింక్ అయి ఉండాలి
వెబ్ సైట్ లో Instant E-PAN ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
New E PAN ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
మీ పాన్ కార్డ్ నెంబర్ నమోదు చేయాలి
అది గుర్తు లేక‌పోతే ఆధార్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయండి
ఆ కింద Accept పై క్లిక్ చేయాలి
మీరు పాన్ కి ఇచ్చిన మొబైల్ నెంబ‌ర్ కు OTP వస్తుంది
అలా OTPని నమోదు చేసి, వివరాలను జాగ్రత్తగా చేక్ చేసుకోండి
ఇక్క‌డ మీరు ఈ మెయిల్ ఐడీ ఇస్తే అక్క‌డ Confirm పైన క్లిక్ చేయాలి.
మీ ఈ మెయిల్ ఐడీకి ఈ పాన్ కార్డ్ వ‌స్తుంది