బంగారం ధర మరోసారి పెరిగింది. బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్దితులు కూడా ప్రధాన కారణం అనే చెబుతున్నారు. ముఖ్యంగా షేర్ల ర్యాలీ కొనసాగడం లేదు అన్నీ సూచీలు డౌన్ లో ఉన్నాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టుబడి పెడుతున్నారు.
ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము 24 రూపాయలు పెరిగింది. నిన్న గ్రాము బంగారం ధర రూ. 4,351 ఉండగా ఈ రోజు ధర రూ. 4,375కి చేరుకుంది. మొత్తంగా పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ.43,750 లుగా ఉంది.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర క్యారెట్‌కి రూ.26 వంతున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,730కి చేరుకుంది. నిన్న ఈ బంగారం ధర రూ. 47,470గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,730గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,750గా ఉంది.