ప్రస్తుతం భారత్లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు ఆధార్. బ్యాంకు అకౌంట్ దగ్గరి నుంచి మరే ఇతర సేవ పొందాలన్నా ఆ కార్డు ఉండాల్సిందే. అలాగే ప్రభుత్వం నుంచి ఏ పథకం కావాలన్నా ఆధార్ తప్పనిసరి. విద్యార్థుల నుంచి వయోజనుల వరకు అందరికీ ఈ విశిష్ట గుర్తింపు కార్డు కచ్చితంగా ఉండాల్సిందే.
ఆధార్ లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి చిన్నపాటి అవసరాలకు కూడా ఈ ఆధార్ ఉపయోగపడుతుంది. ఇక ఆధార్ కార్డు ఉన్న వారికి శుభవార్త చెప్పంది కేంద్రం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 166 ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ సెంటర్‌లను తెరవాలని యోచిస్తోంది. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం 166 ఆధార్ సేవా కేంద్రాలలో 58 వ్యాపారం కోసం ఏర్పాటు చేయనున్నారు. అదనంగా బ్యాంకులు, పోస్టాఫీసులు, రాష్ట్ర ప్రభుత్వాలు 52,000 ఆధార్ నమోదు కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఆధార్ దేశవ్యాప్తంగా 122 నగరాల్లో 166 ఆధార్ సేవా కేంద్రాలను నిర్వహించాలని యోచిస్తోంది. వీటిలో ఇప్పటి వరకు 58 కేంద్రాలను ఏర్పాటు సేవలను ప్రారంభించింది. ఈ కేంద్రాలన్నీ వికలాంగులకు, ఇతర వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.