క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త.. బిల్ పేపై కీలక నిర్ణయం

0
39

క్రెడిట్‌ కార్డులను సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ ఖర్చులపై రాయితీ కూడా పొందొచ్చు. చాలా సందర్భాలకు ఒకే కార్డు అవసరమైనప్పటికీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ కార్డులు ఉండడం అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తాయి. కానీ వీటి వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.

మామూలుగా బిల్ జనరేట్ అయిన 20 రోజుల్లో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా బిల్ చెల్లించకపోతే పెనాల్టీ, వడ్డీ భారం పడుతుంది. ఒకసారి బిల్లింగ్ సైకిల్ ఫిక్స్ అయిందంటే ఆ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అయ్యేవరకు అందులో మార్పు ఉండదు. కానీ తాజాగా క్రెడిట్ కార్డు వాడే వారికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.

ఇందుకోసం జూలై 1 నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ బిల్లింగ్ సైకిల్ ఒకసారి మార్చుకోవచ్చు. అంటే క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండే తేదీలో బిల్ చెల్లించేందుకు బిల్లింగ్ సైకిల్ మార్చాలని బ్యాంకును కోరింది.క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండే తేదీలో బిల్ చెల్లించేందుకు బిల్లింగ్ సైకిల్ మార్చాలని బ్యాంకును కోరొచ్చు. ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది..