డిస్నీ+ హాట్‌స్టార్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.49కే!

Good news for Disney + Hotstar users .. Rs 49k!

0
39

ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్‌స్టార్‌ కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కొత్తగా నెలవారీ మొబైల్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.49 సబ్‌స్క్రిప్షన్‌తో ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీనిద్వారా యూజర్స్‌ ఏదైనా ఒక డివైజ్‌ (స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌)లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలను పొందవచ్చు.

720 పిక్సెల్ హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. ఇందులో యాడ్స్‌ కూడా ఉంటాయి. దీని గురించి డిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ పలువురు యూజర్స్ రెడిట్ సామాజిక మాధ్యమం ద్వారా రూ.49 ప్లాన్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అయితే రూ.99 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌నే కార్డ్‌, ఫోన్‌పే, పేటీఎం, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు రూ.49కే అందజేస్తున్నట్లు మరికొంతమంది యూజర్స్ పేర్కొన్నారు.

ఇవేకాకుండా డిస్నీ+ హాట్‌స్టార్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై రూ. 100 తగ్గింపును ఇస్తోంది. అంటే రూ. 299 ప్లాన్‌ను యూజర్స్ 6 నెలలకు సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే రూ. 199కే లభిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబరులో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ధరలలో మార్పులు చేసింది. రూ.399 వీఐపీ ప్లాన్‌తో యూజర్స్ అన్ని రకాల కంటెంట్‌ను చూడొచ్చు. అలానే కొత్తగా రూ. 499 మొబైల్‌, రూ. 899 సూపర్‌, రూ. 1,499 ప్రీమియం పేరుతో మూడు వార్షిక ప్లాన్లను పరిచయం చేసింది.