పల్సర్ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. కొత్త లుక్‌తో మరో బైక్!

Good news for Pulsar lovers .. Another bike with a new look!

0
40

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ బైక్ కొత్త బజాజ్ పల్సర్ 250 సిసి టీజర్‌ను విడుదల చేసింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ బైక్‌ను 28 అక్టోబర్ 2021న మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే పల్సర్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బైక్ కోసం టీజర్‌లో ఇది ఎన్నడూ లేనంత పెద్ద పల్సర్ బైక్ అని కంపెనీ పేర్కొంది.

ఈ బైక్‌ టీజర్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. మునుపటి పల్సర్ కంటే సైజు కూడా పెద్దదిగా కనిపిస్తుంది. బైక్ హెడ్ ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. వెనుక సీటు ఎత్తు కూడా సరిపోతుంది. చాలా సొగసైన లుక్ , శక్తివంతమైన 250 సీసీ ఇంజిన్ కలిగి ఉంది ఈ బైక్. బజాజ్ ఆటో తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కొత్త బైక్ టీజర్‌ను విడుదల చేసింది.