ఎస్బీఐ ఖాతాదారులకి గుడ్‌న్యూస్‌..ఇక ఆ సేవలు ప్రారంభం

0
93

దేశీయ అతి పెద్ద బ్యాంకు ఎస్బిఐ ఎప్పటికప్పుడు కస్టమర్లకు అనేక సేవలను తీసుకొస్తుంది. దీనితో ప్రజలు కొన్ని సేవలను ఇంట్లో నుండే పొందుతున్నారు. ఇక తాజాగా ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లకు కాల్ చేయడం వల్ల మీరు ఫోన్‌లో బ్యాంకింగ్ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. శని, ఆదివారాలు కూడా కొన్ని సౌకర్యాలు అందించనుంది. ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా, వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందిస్తూ ఎస్బీఐ సంప్రదింపు కేంద్రం టోల్ ఫ్రీ నంబర్‌కు 1800-1234 లేదా 1800-2100కు కాల్ చేయడం ద్వారా మీ బ్యాంకింగ్ అవసరాలను తీర్చుకోవచ్చు. అన్ని ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్ల ద్వారా ఈ నెంబర్లకి కాల్‌ చేసుకోవచ్చు.

ఈ రెండు నెంబర్లు టోల్ ఫ్రీ నంబర్లు. వీటికి ఫోన్ చేయడం ద్వారా బ్యాంకు మీకు ఐదు రకాల సేవలు అందిస్తుంది. మీరు సర్వీస్ ఖాతాలో 24×7 బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఏటీఎమ్‌ కార్డ్ రిక్వెస్ట్‌ను బ్లాక్ చేసినట్లయితే డిస్పాచ్ స్టేటస్, చెక్ బుక్ డెస్పాచ్ స్టేటస్ , సేవింగ్స్‌పై వడ్డీ, TDS సమాచారంతో పాటు బ్లాక్ చేయబడిన గత ఐదు లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు.