మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు శుభవార్త. మైక్రోసాఫ్ట్ సంస్థ సరికొత్త అప్‌డేట్ విండోస్ 11ని విడుదల చేసింది. ఉచితంగానే ఈ సరికొత్త వెర్షన్‌ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియాలోని వినియోగదారులకు మైక్రోసాప్ట్ అందుబాటులోకి తెచ్చింది.
కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్ అప్‌డేట్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అక్కడున్న విండోస్ అప్‌డేట్‌లో అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి. సిస్టమ్ అప్‌డేట్‌కి అనువుగా ఉంటే అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేస్తే..సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
విండోస్ 10 వెర్షన్‌పై పని చేస్తున్న ల్యాప్‌టాప్, కంప్యూటర్లే విండోస్ 11 వెర్షన్‌పై పని చేయడానికి అనువుగా ఉన్నాయి. అయితే ఇందులో కూడా అన్ని విండోస్ 11కి కాంపాటిబుల్ కావు. పీసీ హెల్త్ చెకప్ వంటి యాప్‌ల ద్వారా మన దగ్గరున్న ల్యాపీ లేదా పీసీ విండోస్ 11 వెర్షన్‌కి అనువుగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు.