యూజర్లకు గుడ్ న్యూస్..ఆ ఫీచర్ తెచ్చేస్తున్న ట్విట్టర్!

0
129

యూజర్లకు ట్విట్టర్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్విట్టర్​లో ఎడిట్‌ ట్వీట్ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఇది కొద్దిమందికి మాత్రమే అని సమాచారం. పూర్తిస్థాయి యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్​ ప్రకటించింది.

“మీ ట్విటర్‌ ఖాతాలో ఎడిట్ బటన్‌ కనిపిస్తే కంగారుపడకండి.. ఈ ఫీచర్‌ ఇంకా పరీక్షల దశలోనే ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తాం” అని ట్వీట్‌లో పేర్కొంది. ముందుగా ఈ ఫీచర్‌ను ట్విట్టర్​ బ్లూ యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం యూజర్లకు కనిపించే ఎడిట్ బటన్‌ పనిచేయదని తెలిపింది.

ఈ ఫీచర్‌లో ట్వీట్‌ చేసిన 30 నిమిషాల వరకు ఎడిట్‌ చేయొచ్చట. ఆ తర్వాత ట్వీట్‌లో మార్పులు చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. అలానే ట్వీట్‌ను ఎడిట్‌ చేసినట్లు లేబుల్ కూడా కనిపిస్తుందట. ఎడిట్‌ చేయకముందు ట్వీట్‌ను యూజర్లు చూసే సౌలభ్యం ఉంటుందని సమాచారం.