బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. ఒకరోజు ధరలు తగ్గగా మరో రోజు పెరుగుతాయి. కొన్నిరోజులు బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. అయితే ధరల్లో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా భారత్ లో వ్యాపారాలు సాగుతాయి. ఎందుకంటే మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా బంగారం ధర తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 తగ్గి రూ.45,800 గా ఉంది.
విజయవాడ మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 తగ్గి రూ.45,800 గా ఉంది.
ఇక వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి రూ.900 తగ్గి 55,400గా కొనసాగుతుంది.
ఈ ధరలు అన్ని ప్రాంతాల్లో ప్రామాణికం కాదు. ఆయా పట్టణాల్లో ధరల వ్యత్యాసం ఉండవచ్చు.