మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.350కు పైగా పెరిగి ప్రస్తుతం రూ.52,850 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.560కు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.55,870 వద్ద ఉంది.