సెప్టెంబరు మాసంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండొచ్చు ?

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇటీవల కాలంలో కొద్దిగా మందగించినట్లు అన్ని వర్గాల్లో వినిపిస్తున్నమాట

0
110

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇటీవల కాలంలో కొద్దిగా మందగించినట్లు అన్ని వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఒక్క హైదరాబాదే కాదు ఇండియా అంతటా అదే పరిస్థితి ఉందని కొందరు అంటుండగా… కాదు కాదు అమెరికాలోనూ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిందని అంటున్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే రియల్ ఢమాల్ స్టార్ట్ అయిందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలాంటి చర్చలు ఎలా ఉన్నప్పటికీ శ్రావణమాసంలో రియల్ ఎస్టేట్ స్వింగ్ లో ఉంటుందేమో అనుకున్నవారికి మాత్రం నిరాశ తప్పలేదు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గణాంకాలు, రిజిస్ట్రేషన్ల లెక్కలు చూస్తే శ్రావణమాసంలో అంతంతంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది.

ఎండాకాలం తర్వాత జూన్, జూలై లో స్కూల్, కాలేజీల ఫీజులు, పిల్లల ఖర్చులతో ఇన్వెస్ట్ చేసేందుకు జనాల దగ్గర అంతగా డబ్బులు లేవు. పైగా ఆశాడ మాసం కావడంతో మంచిరోజులు లేవని ఇన్వెస్ట్ చేసేవారు వెనకడగు వేశారని చెప్పవచ్చు. కానీ ఆగస్టు నెలలో అంటే శ్రావణమాసంలో మంచి రోజులు ఉంటాయి కాబట్టి ప్రాపర్టీ కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు భారీగా ఉంటాయని భావించారు. కానీ శ్రావణమాసంలో ఆశించినంతగా జరగలేదని ఎక్కువ మంది రియల్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో శ్రావణమాసంలో ప్రతిరోజు కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 60 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ ఈ శ్రావణంలో 20 నుంచి 30 దగ్గరే ఆగిపోయినట్లు సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నమాట. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు మాసంపైనే రియల్టర్లు, బిల్డర్లు భారం వేస్తున్నారు. మరి సెప్టెంబరు మాసం రియల్ ఎస్టేట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? భారీగా పెరుగుతుందా? లేదంటే ఇప్పటిలాగే మందగమనంలో సాగుతుందా? అన్నదానిపై ఒక రకరకాల చర్చలు సాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ టివిని సబ్ స్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే మరింత ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే సబ్ స్క్రయిబ్ చేసుకోండి.

ఇటీవల కాలంలో రిజర్వు బ్యాంకు గననీయంగా వడ్డీ రేట్లు పెంచి కూర్చుంది. దీంతో బ్యాంకు రుణాలు తీసుకుని ఇండ్లు, స్థలాలు లాంటి ప్రాపర్టీ కొనుగోలు చేసేవారు ఒకడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. కరోనా కాలం నుంచి చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకింత ఒడిదొడుకులకు లోనైంది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ లో అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నవారు సైతం 111 జిఓ ఎత్తివేత వార్తల నేపథ్యంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. సిటీలో అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొనేబదులు అంతే డబ్బుతో 111 జిఓ పరిధిలో విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనొచ్చు కదా? అన్న భావనలో ఉన్నారు. ఒకవేళ ఫ్లాట్స్ కొనాలనుకుంటే ఇక్కడి రేట్ తో పోలిస్తే 111 జిఓ లిమిట్స్ లో అయితే ఇంకా తక్కువ ధరకే దొరుకుతాయి కదా అన్న ఆలోచనలు చేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు మందగించడంలో ఇదొక కారణంగా చెబుతున్నారు.
అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పనిచేసిందని చెబుతున్నమాట. సెప్టెంబరు మాసంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో స్థిరత్వం వస్తుందని, తద్వారా ఇండ్లు, స్థలాలు, విల్లాలు, అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ కొనుగోళ్లు పెరుగుతాయని క్రెడాయ్ సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో గతం కంటే సెప్టెంబరు మాసం రియల్ ఎస్టేట్ కు కొత్త ఊపు తీసుకొస్తుందని వారు విశ్వసిస్తున్నారు. మరి ఫీల్డులో ఎలా ఉంటుందో సెప్టెంబరులోనే తెలియాలి.