ఇన్‌స్టాగ్రామ్‌ను యువతకు సురక్షిత ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ యాజమాన్యం నూతన ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. హాని కలిగించే కంటెంట్‌కు దూరంగా ఉండే విధంగా ఎంచుకునే వెసులుబాటును యూజర్‌కు కల్పించనుంది. ప్లాట్‌ఫామ్ నుంచి కాసేపు విరామం తీసుకునేలా యువతను ప్రోత్సహించే ఫీచర్‌నూ ప్రవేశపెట్టనుంది. ఇన్‌స్టా ద్వారా యువతకు ఫేస్బుక్ హాని కలిగిస్తోందని ఫేస్బుక్ మాజీ ఉద్యోగిని ఆరోపించిన వెంటనే ఈ ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
సురక్షితం కాని కంటెంట్‌ను యువత తరచుగా చూస్తున్నట్లయితే..అలాంటి వారిని వేరే కంటెంట్ చూసే విధంగా ప్రోత్సహించనున్నారు. హానికరమైన సమాచారాన్ని యువత చూస్తున్నట్లయితే.. ప్లాట్‌ఫామ్ నుంచి కాసేపు విశ్రాంతి తీసుకోమని పాప్అప్ వస్తుంది. దీంతో అతడు తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నట్లు తెలుసుకోగలడని వెల్లడించింది ఆ సంస్థ.