యువత కోసం ఇన్​స్టా సరికొత్త ఫీచర్..!

Insta is the newest feature

0
37

ఇన్​స్టాగ్రామ్​ను యువతకు సురక్షిత ప్లాట్​ఫామ్​గా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ యాజమాన్యం నూతన ఫీచర్స్​ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. హాని కలిగించే కంటెంట్​కు దూరంగా ఉండే విధంగా ఎంచుకునే వెసులుబాటును యూజర్​కు కల్పించనుంది. ప్లాట్​ఫామ్​ నుంచి కాసేపు విరామం తీసుకునేలా యువతను ప్రోత్సహించే ఫీచర్​నూ ప్రవేశపెట్టనుంది. ఇన్​స్టా ద్వారా యువతకు ఫేస్​బుక్​ హాని కలిగిస్తోందని ఫేస్​బుక్ మాజీ ఉద్యోగిని ఆరోపించిన వెంటనే ఈ ఫీచర్స్​ను తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

సురక్షితం కాని కంటెంట్​ను యువత తరచుగా చూస్తున్నట్లయితే..అలాంటి వారిని వేరే కంటెంట్ చూసే విధంగా ప్రోత్సహించనున్నారు. హానికరమైన సమాచారాన్ని యువత చూస్తున్నట్లయితే.. ప్లాట్​ఫామ్​ నుంచి కాసేపు విశ్రాంతి తీసుకోమని పాప్అప్​ వస్తుంది. దీంతో అతడు తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నట్లు తెలుసుకోగలడని వెల్లడించింది ఆ సంస్థ.