పాతదయ్యే కొద్దీ ఫోన్, కంప్యూటర్ పని తీరు నెమ్మదిస్తుంది. అప్పుడు వెబ్‌సైట్స్ లోడ్ అవడం కోసం ఎదురుచూస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యను అందరూ ఎదుర్కొంటారు. అయితే ఈ టిప్స్ ద్వారా మీ కంప్యూటర్ స్లో అవకుండా చూసుకోవచ్చు.
ప్రకాశవంతమైన కొత్త కంప్యూటర్‌కు, నిదానంగా పనిచేసే పాతదానికి తేడా మనం అందులో లోడ్ చేసిన అప్లికేషన్లే. ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్‌లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. ఒకసారి ఇన్స్టాల్ అయినంత మాత్రాన అవి చివరివరకు హార్డ్డ్రైవ్లోనే ఉండాలని లేదు. తరచుగా వాడే అప్లికేషన్లను గుర్తించి మిగిలినవాటిని తొలగించాలి. అవసరమైతే తర్వాత వాటిని రీఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ప్రోగ్రామ్‌లు:
చాలా ప్రోగ్రామ్‌లు వాటిలోని డీఫాల్ట్ సెట్టింగ్స్ వల్ల ఇన్స్టాల్ చేయగానే వాటికి నచ్చింది చేస్తుంటాయి. కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు మన అనుమతి లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. ఇలా నడిచే యాప్‌ల సంఖ్య పరిమితంగా ఉంటే మేలు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని ఎక్కువ యాప్‌లు పనిచేస్తుంటే.. మెషీన్ అంత నెమ్మదిస్తుంది.
మిగిలిన స్టోరేజీపై కన్ను:
మెషీన్ నెమ్మదించడానికి మరో కారణం.. అది పనిచేయడానికి అవసరమైన స్టోరేజీ ఖాళీగా లేకపోవడం. అందుకోసం అనవసరమైన యాప్‌లను తొలగించడం సహా హార్డ్‌డ్రైవ్‌లో తగినంత స్టోరేజీ ఉండేలా చూసుకోవాలి. కనీసం 20శాతం ఫ్రీగా ఉంటే మంచిది.
ఈ యాప్‌లు ఆటోమేటిక్‌గా రన్ కాకుండా ఉండాలంటే..
ఎప్పటికప్పుడు రీసెట్:
మీ ప్రోగ్రామ్లలానే విండోస్, MacOS కూడా ఎల్లవేళలా అప్ టు డేట్ పెట్టుకోవాలి. Windows Settingsలో Update & Security, లేదా macOS System Preferencesలో Software Update ద్వారా మీ ఓఎస్ లేటెస్ట్ వెర్షన్లోనే ఉందో లేదో చూసుకోవాలి. ఇవి కాకుండా కంప్యూటర్ను తరచుగా రీసెట్ చేస్తుండాలి. అందుకోసం మీ ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకొని, తర్వాత ప్రోగ్రామ్స్‌ను రీఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ సులువే అయినా కొద్దిగా సమయం తీసుకుంటుంది. కానీ, అనవసరమైన సాఫ్ట్వేర్లను తొలగించి సిస్టమ్ క్లీన్‌గా ఉంచడానికి ఎంతో ఉపకరిస్తుంది.