మీ కంప్యూటర్​ నెమ్మదిస్తుందా? అయితే ఈ టిప్స్ పాటించండి..

0
37

పాతదయ్యే కొద్దీ ఫోన్, కంప్యూటర్ పని తీరు నెమ్మదిస్తుంది. అప్పుడు వెబ్​సైట్స్​ లోడ్​ అవడం కోసం ఎదురుచూస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యను అందరూ ఎదుర్కొంటారు. అయితే ఈ టిప్స్​ ద్వారా మీ కంప్యూటర్​ స్లో అవకుండా చూసుకోవచ్చు.

ప్రకాశవంతమైన కొత్త కంప్యూటర్​కు, నిదానంగా పనిచేసే పాతదానికి తేడా మనం అందులో లోడ్​ చేసిన అప్లికేషన్లే. ఇన్​స్టాల్​ చేసిన ప్రోగ్రామ్​లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. ఒకసారి ​ఇన్​స్టాల్ అయినంత మాత్రాన అవి చివరివరకు హార్డ్​డ్రైవ్​లోనే ఉండాలని లేదు. తరచుగా వాడే అప్లికేషన్​లను గుర్తించి మిగిలినవాటిని తొలగించాలి. అవసరమైతే తర్వాత వాటిని రీఇన్​స్టాల్​ చేసుకోవచ్చు.

ప్రోగ్రామ్​లు:

చాలా ప్రోగ్రామ్​లు వాటిలోని డీఫాల్ట్​ సెట్టింగ్స్​ వల్ల ఇన్​స్టాల్​ చేయగానే వాటికి నచ్చింది చేస్తుంటాయి. కంప్యూటర్​ ఆన్​ చేసినప్పుడు మన అనుమతి లేకుండానే బ్యాక్​గ్రౌండ్​లో రన్​ అవుతుంటాయి. ఇలా నడిచే యాప్​ల సంఖ్య పరిమితంగా ఉంటే మేలు. ఎందుకంటే బ్యాక్​గ్రౌండ్​లో ఎన్ని ఎక్కువ యాప్​లు పనిచేస్తుంటే.. మెషీన్​ అంత నెమ్మదిస్తుంది.

మిగిలిన స్టోరేజీ​పై కన్ను:

మెషీన్ నెమ్మదించడానికి మరో కారణం.. అది పనిచేయడానికి అవసరమైన స్టోరేజీ ఖాళీగా లేకపోవడం. అందుకోసం అనవసరమైన యాప్​లను తొలగించడం సహా హార్డ్​డ్రైవ్​లో తగినంత స్టోరేజీ ఉండేలా చూసుకోవాలి. కనీసం 20శాతం ఫ్రీగా ఉంటే మంచిది.

ఈ యాప్​లు ఆటోమేటిక్​గా రన్​ కాకుండా ఉండాలంటే..

ఎప్పటికప్పుడు రీసెట్​:

మీ ప్రోగ్రామ్​లలానే విండోస్, ​MacOS కూడా ఎల్లవేళలా అప్​ టు డేట్ పెట్టుకోవాలి. Windows Settingsలో Update & Security, లేదా macOS System Preferencesలో Software Update ద్వారా మీ ఓఎస్​ లేటెస్ట్​ వెర్షన్​లోనే ఉందో లేదో చూసుకోవాలి. ఇవి కాకుండా కంప్యూటర్​ను తరచుగా రీసెట్​ చేస్తుండాలి. అందుకోసం మీ ఫైల్స్​ను బ్యాకప్​ చేసుకొని, తర్వాత ప్రోగ్రామ్స్​ను రీఇన్​స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ సులువే అయినా కొద్దిగా సమయం తీసుకుంటుంది. కానీ, అనవసరమైన సాఫ్ట్​వేర్​లను తొలగించి సిస్టమ్​ క్లీన్​గా ఉంచడానికి ఎంతో ఉపకరిస్తుంది.