మీ ల్యాప్ టాప్ వేడెక్కుతోందా?..అయితే ఇలా చేయండి

Is your laptop warming up? .. but do it like this

0
91

ప్రస్తుత కరోనా సమయంలో ల్యాప్​టాప్​ల వాడకం తప్పనిసరైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పని కారణంగా రోజంతా ల్యాపీని ఉపయోగిస్తున్నాం. ఆఫీస్ వర్క్ కు, ఆన్ లైన్ క్లాసులకు ల్యాప్ టాప్స్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే ఎక్కువ సమయం ల్యాప్ టాప్స్ ను వినియోగిస్తే అవి వేడెక్కుతాయి. ల్యాప్ టాప్స్ వేడెక్కడం వల్ల కొన్నిసార్లు ల్యాప్ టాప్స్ కాలిపొయే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ల్యాప్‌టాప్‌ వేడెక్కడానికి అసలు కారణం ఏంటి? వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

ల్యాప్‌టాప్ వేడెక్కకుండా అందులోని కూలింగ్ ఫ్యాన్‌లు పని చేస్తాయి. కొన్నిసార్లు ఈ ఫ్యాన్లపైకి దుమ్ము చేరుకోవడం వల్ల వాటి పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో అవసరమైన కూలింగ్‌ను ల్యాపీకి అందించలేవు. కొన్ని ల్యాప్‌టాప్‌లలో కూలింగ్ ఫ్యాన్లు ఉండవు. అలాంటి వాటిలో ఉత్పత్తయ్యే వేడి ల్యాప్‌టాప్‌ బాడీ ఫ్రేమ్‌కు అన్ని వైపులా ఉండే వెంటిలేటర్లు, ఎగ్జాస్ట్‌ ద్వారా బయటికి వెళుతుంది. అలానే ల్యాప్‌టాప్‌కు అవసరమైన కూలింగ్ బయట నుంచి అందుతుంది. ఒకవేళ వీటికి దుమ్ము పట్టినా ల్యాప్‌టాప్‌కు సరిపడినంత కూలింగ్ అందక వేడెక్కే అవకాశం ఉంది. వీటితోపాటు థర్మల్‌ పేస్ట్‌ లేదా థర్మల్‌ పాడ్ పాడైనా వేడెక్కే అవకాశం ఉంది. థర్మల్‌ పాడ్ లేదా థర్మల్‌ పేస్ట్‌ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వేడిని కూలింగ్‌ ఫ్యాన్లకు చేరవేస్తుంది. ఇది ప్రాసెసర్‌, హీట్‌ సింక్‌కు మధ్య ఉంటుంది.

కొన్ని వాక్యూమ్‌ క్లీనర్స్‌ ఎక్కువ ప్రెజర్‌ను విడుదల చేస్తాయి. కాబట్టి, అనుభవం లేకుంటే ఉపయోగించపోవడం మేలు. ప్రెజర్‌ ఎక్కువయితే ల్యాప్‌టాప్‌లోని సున్నితమైన భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తక్కువ ప్రెజర్‌ ఉండే ఎయిర్‌ పంప్‌లతో కూడా కూలింగ్‌ ఫ్యాన్‌లు శుభ్రం చేయొచ్చు. తర్వాత ల్యాప్‌టాప్‌ ఎగ్జాస్ట్‌, వెంటిలేటర్లను సున్నితమైన బ్రెజిల్స్‌ ఉన్న బ్రష్‌తో శుభ్రం చేయాలి. ల్యాప్‌టాప్‌ వెనుక భాగం ఓపెన్ చేయడం, కూలింగ్ ఫ్యాన్, వెంటిలేటర్లు వంటి వాటిని శుభ్రం చేసిన అనుభవం లేకుంటే, సర్వీస్‌ ప్రొవైడర్లు ఆశ్రయించమని నిపుణులు సూచిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్‌ చేసి కేబుల్స్‌, బ్యాటరీని తొలగించాలి. తర్వాత మీ ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి కూలింగ్‌ ఫ్యాన్లను దూది లేదా ఇయర్‌బడ్స్‌ను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌లో ముంచి శుభ్రం చేయాలి. అయితే ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్ ల్యాప్‌టాప్ కాంపొనెంట్స్‌పై లేకుండా పూర్తిగా ఆవిరి అయ్యేలా తుడవాలి. దూది లేదా ఇయర్‌బడ్స్‌ బదులు వాక్యూమ్‌ క్లీనర్ కూడా ఉపయోగించవచ్చు.

ల్యాప్‌టాప్‌ వేడెక్కుతుందని గుర్తించిన వెంటనే ముందుగా కూలింగ్ ఫ్యాన్లను శుభ్రం చేయాలి. ఎందుకంటే ఇవి ల్యాప్‌టాప్‌లో ఎంతో కీలకమైన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ (సీపీయూ), గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ (జీపీయూ)కు అవసరమైన కూలింగ్‌ను అందిస్తాయి. వీటిపై దుమ్ము చేరితే ఫ్యాన్ల పనితీరు మందగించి, ఎయిర్‌ఫ్లోను అడ్డుకుంటాయి. వీటిని శుభ్రం చేసే ముందు ఈ సూచనలు పాటించడం మేలంటున్నారు టెక్ నిపుణులు.