పోర్న్ సైట్ లో పాఠాలు..ఏడాది రూ.2 కోట్లు సంపాదన

Lessons on porn site..Earnings of Rs 2 crore per year

0
35

పోర్న్ అనగానే ప్రతి ఒక్కరి మెదళ్లలో గుర్తొచ్చేది బూతు, అసహ్యం, అశ్లీలం. లెక్కల పాఠాలూ అందులో వస్తే.. అదో వింత అంటారు కదా. తైవాన్ కు చెందిన చాంగ్షూ అనే ఓ ఉపాధ్యాయుడు పోర్న్ హబ్ అనే ఓ అశ్లీల వెబ్ సైట్ లో లెక్కల పాఠాలు చెబుతున్నాడు. అంతేకాదు కోట్లు సంపాదిస్తున్నాడు. అతడి వీడియోలకు లక్షలాది వీక్షణలూ వస్తున్నాయి. దీంతో అతడు ఏటా రూ.2 కోట్లు జేబులో వేసుకుంటున్నాడు.

ఒక్క పోర్న్ హబ్ లోనే కాదు.. పలు పోర్న్ సైట్లలోనూ లెక్కల పాఠాలు చెప్పేందుకు అతడు ప్రయత్నించినా అది ఫలించలేదు. ఇలాంటి అశ్లీల సైట్లలో తన లెక్కల పాఠాలను అప్ లోడ్ చేస్తే చాలా మంది చూస్తారన్న కొత్త ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చాంగ్షూ అంటున్నాడు.

తన వీడియోలంటే ఎవరికీ నచ్చకపోయినా.. ‘అడల్ట్ సైట్’ టీచర్ పాఠాలంటే ఎంతో మంది ఆసక్తిగా చూస్తారని చెప్పుకొచ్చాడు. కొత్తదనం కావాలనుకునే చాలా మంది అడల్ట్ సైట్ లో తన వీడియోలు చూస్తారంటున్నాడు. కాగా, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ చానెళ్లలోనూ చాంగ్షూ ఇలా లెక్కల పాఠాలు చెబుతున్నాడు.