వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ అందరూ తెలుసుకోండి

Let everyone know the newest feature in WhatsApp

0
108

మన స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటోంది. కోట్లాది మంది ఈ వాట్సాప్ ని వాడుతున్నారు. ముఖ్యంగా చాటింగ్ వీడియో కాల్ తో ఇది మరింత జనాలకు దగ్గర అయింది. ఈ కరోనా సమయంలో వీడియో కాల్స్కు బాగా ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు గ్రూప్ వీడియో కాల్స్తో సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇలాంటి వేళ
మరో కొత్త ఫీచర్ను యాడ్ చేసింది వాట్సాప్. మరి ఆ ఫీచర్ ఏమిటో చూద్దాం.

బయట మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా ఈ మెసేజింగ్ సైట్కు ఇంత ఆదరణ లభిస్తోంది. సాధారణంగా ఎవరైనా మనల్ని గ్రూప్ కాల్కు ఇన్వైట్ చేసిన సమయంలో మనం కాల్ లిఫ్ట్ చేయకపోతే. అప్పటికే ప్రారంభమైన వీడియో సెషన్లో మనకు పాల్గొనే అవకాశం ఉండదు. ఇక ఈ ఇబ్బంది ఉండదు.

తాజాగా వాట్సాప్ జాయినబుల్ కాల్స్ అనే ఫీచర్ను యాడ్ చేసింది. ఈ సమస్యకు చెక్ పెట్టింది.దీంతో యూజర్లు ఏ సమయంలోనైనా గ్రూప్ కాల్స్లో జాయిన్ కావొచ్చు. అంతేకాకుండా కాల్ ఇన్ఫో స్క్రీన్ అనే ఆప్షన్ను కూడా తీసుకొచ్చారు. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా అప్పటికే గ్రూప్ కాల్లో ఎవరెవరు ఉన్నారు, మిమ్మల్ని వీడియోకాల్కు ఎవరు ఇన్వైట్ చేశారన్న విషయాలను తెలుసుకోవచ్చు.