సామాన్యుడి నెత్తిపై మరింత భారం..భారీగా పెరగనున్న పాల ధరలు

More burden on the scalp of the common man .. Milk prices will rise heavily

0
38

సామాన్యుడి నెత్తిపై మరింత భారం పడనుంది. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది.  పాల వినియోగదారులకు మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.

అమూల్ పాల ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. పాల ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సీనియర్ అధికారి వెల్లడించారు. ధరల పెంపుకు గల కారణాలను కూడా వెల్లడించారు. పాల ప్యాకెట్, రవాణా, పశుగ్రాసం ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు గుజరాత్ మార్కెటింగ్ ఫెడరేషన్ పేర్కొంది. గత రెండు సంవత్సరాల్లో తాజా పాల ప్యాకెట్ ధర కేవలం 4 శాతం మేర మాత్రమే సవరించామని స్పష్టం చేసింది. లీటరు పాల ధర అ రెండు రూపాయల చొప్పున పెంచుతున్నట్లు అమ్ములు బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేసే గుజరాత్ ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిన్న ప్రకటన చేసింది.

ఈ ప్రకటన ప్రకారం ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. లీటర్ అమూల్ పాల పైన రూ.2 పెంచుతున్నట్లు తెలిపారు. కాగా, అమూల్‌ బ్రాండ్‌లో ఉన్న అన్ని రకాల పాల ఉత్పత్తులకు కొత్త ధరలు వర్తించనున్నాయి. ఆవు, గేదె పాలకు చెందిన అన్ని ర‌కాల ఉత్ప‌త్తులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. కాగా 2021 జూలైలో లీటరు పాలకు రెండు రూపాయల చొప్పున అమూల్ పెంచిన సంగతి తెలిసిందే.