నిరుద్యోగుల‌కి పేటీఎం గుడ్ న్యూస్

Paytm good news for the unemployed

0
120

ఈ క‌రోనా ప‌రిస్దితుల వ‌ల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే కొత్త‌గా చ‌దువులు పూర్తి చేసిన వారు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి వేళ‌ పేటీఎం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది నిరుద్యోగుల‌కి. దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకునేందుకు నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను విస్తృతం చేసేందుకు పేటీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పేటీఎం భారీ వ్యాపార విస్త‌ర‌ణ‌కు ప్లాన్ చేస్తోంది.
ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలవారీ వేతనంగా రూ.35 వేలను ఇస్తారని తెలుస్తోంది.

ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేమెంట్ వ్యాలెట్, పేటీఎం సౌండ్ బాక్స్, యూపీఐ, మర్చంట్ లోన్స్, పేటీఎం పోస్ట్ పెయిడ్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తోంది. యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా ఉంది.