కేసిఆర్ గారూ… మాట నిలబెట్టుకోండి !

0
39

తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు బుధవారం ఒక మీడియా ప్రకటన జారీ చేశారు. తమ ఉద్యోగాలను పునరుద్ధరించాలని కోరారు. వారు రిలీజ్ చేసిన ప్రకటన యదాతదంగా…

పట్టభద్రుల శాసన మండలి ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చారు రద్దయిన వీఆర్వో పోస్ట్ ను పునరుద్ధరించి రెవెన్యూ శాఖలోని సదురుబాటు చేసి సరిసమానమైన హోదా తో పాటు అర్హులైన అందరి వీఆర్వోలకు పదోన్నతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

గత సంవత్సరం 9.9. 2020 నా 5485 మంది వీఆర్ఓల పోస్టులను రద్దు చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపుగా పది నెలల నుంచి ఎలాంటి జాబ్ చార్ట్ లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు విలువైన భూములను కాపాడుతూ పని చేస్తున్నాము.

ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అప్పటికీ ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూ ప్రభుత్వం చేపడుతున్న టువంటి సంక్షేమ పథకాలన్నీ తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి సంపూర్ణ విజయవంతం చేస్తున్నాము.

1. అనైతికమైన ఆలోచనలతో తొందరపాటుతనంతో వీఆర్వో యొక్క పోస్ట్లు మరియు జాబ్ చార్ట్ ను రద్దు చేశారు.

2. అనాలోచితమైన చీఫ్ సెక్రెటరీ గారి ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న విఆర్వో లకు పదోన్నతి లేకుండా అనిచివేత కు గురయ్యారు.

3. పది నెలల నుంచి ముఖ్యమంత్రి గారి తో పాటు చీఫ్ సెక్రటరీ గారి అపాయింట్మెంట్ కోరినప్పటికీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు.

4. రాష్ట్రంలో అత్యధిక సంఖ్య లో ఉన్న వి ఆర్ వో లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు . ఓసి కులాలలో వెనుకబడిన తరగతుల వాళ్లే ఉన్నారు. వీరి యొక్క సంక్షేమం బాధ్యతలు ప్రభుత్వానిదే.

.5. దళిత బందు ప్రకటించిన ముఖ్యమంత్రి… బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి గొర్లు బర్లు, ఓసి సామాజిక వర్గాలకు చెందిన వారికి వారి వారి కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం ప్రకటిస్తున్న ప్రభుత్వం… పైన తెలుపబడిన సామాజిక వర్గాలకు చెందిన వీఆర్వోల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే.

6. అతి పురాతనమైన ప్రజలకు నేరుగా సేవలందించే రెవెన్యూ శాఖ విచ్చిన్నం అవుతుంటే పట్టించుకోని ఉన్నతాధికారులు.

7. రెవెన్యూ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీ పోస్టును భర్తీ చేయకుండా .. సిసిఎల్ఎ పోస్టును భర్తీ చేయకుండా .. పై రెండు పోస్టులకు చీఫ్ సెక్రెటరీ గారు ఇంచార్జ్ గా ఉండడం మోయలేని బరువులు లాంటివి.

8. రెవెన్యూ శాఖ లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయకుండా 33 జిల్లాల కు గతంలో ఉన్నటువంటి 10 జిల్లాల రెవెన్యూ ఉద్యోగులను సర్దుబాటు చేయడం ఉద్యోగుల యొక్క శ్రమదోపిడిగా భావిస్తున్నాం.

9. తహశీల్దార్లకు మరియు డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి కల్పించకపోవడం ఉద్యోగుల హక్కులను తుంగలో తొక్కి నట్టే.

10. ముఖ్యమంత్రి గారి హామీ మేరకు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నటువంటి వీఆర్ఏలకు స్కేలు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వారి భవిష్యత్తును తుంగలో తొక్కి నట్టే.

11. వీఆర్వో విధులు నిర్వహిస్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వకుండా హక్కులను కాలరాస్తూ అణిచివేతకు గురి చేస్తున్నారు.

12. వీఆర్వోలకు రావలసిన ఇంక్రిమెంట్లు నిలిపివేయడం వారికి ప్రమోషన్లు నిలిపివేయడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటే.

13. ఆంధ్రజ్యోతి దినపత్రిక లో కూర్చోబెట్టి జీతాలు అనే శీర్షికను మేము ఖండిస్తున్నాం… ఆ వార్తను సవరణ చేయాలని కోరుతున్నాం.

2007లో ఆనాటి ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఇంకా బలోపేతం చేయడానికి శాఖలో పని చేస్తున్నటువంటి మా స్థాయి ఉద్యోగుల శ్రమను గుర్తించి మాకు మాకంటూ ఒక హోదా కల్పించి ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి సమాజంలో ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి మాకు ఒక హోదా కల్పించారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కులమతాలకు విభజించి కేవలం ఎస్సీ ఎస్టీలు మరియు బీసీలు మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి మా హక్కుల ను తొలగించి సమాజంలో మాకు విలువ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నది.

. ఈ ప్రభుత్వానికి నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి ముఖ్యమనుకుంటే అధిక సంఖ్యలో ఉన్నటువంటి మమ్మల్ని రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేస్తూ సరిసమానమైన హోదా కల్పిస్తూ అర్హులైన అందరికీ పదోన్నతులు కల్పించి మాకు రావలసిన ఇంక్రిమెంట్లు మరియు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.

గోల్కొండ సతీష్ రాష్ట్ర అధ్యక్షులు
పల్లె పాటి నరేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.